మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడం దారుణం: హరీశ్ రావు

మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడం దారుణం: హరీశ్ రావు

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 28 :  మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి సహా పలువురు నాయకులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా పాలన సాగిస్తోందని విమర్శించారు. కరువు బాధిత రైతులను, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి మూసీ ప్రక్షాళన పేరుతో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామనడం సరికాదన్నారు. కమిషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమంపై లేదని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని పేర్కొన్నారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.