హయత్‌నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు
హయత్‌నగర్, వెలుతురు, అక్టోబర్ 30 :
హయత్‌నగర్ కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్‌లో హయత్‌నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పల్లె లింగంగౌడ్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఏముల రామ్మోహన్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం ఈ రోజు (అక్టోబర్ 30), రేపు (అక్టోబర్ 31) కూడా కొనసాగుతుందని, అవసరాన్ని బట్టి సోమవారం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన న్యాయవాదులు, కోర్టుకు విచారణ నిమిత్తం వచ్చే క్లయింట్లు, కోర్టు సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పంతుల ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ ముకేష్ దుబే, లేడీ రిప్రజెంటేటివ్ భార్గవి, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఏజీపీ శ్రీ సురేందర్ రెడ్డి, సీనియర్ కౌన్సిల్ మడుపు శశికాంత్, సంతోష్ కుమార్ గౌడ్, రాంబాబు, పలువురు న్యాయవాదులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
