భారత్‌పై ముడిచమురు ధరల భారం, ఆర్థిక ఒత్తిళ్లు తప్పకపోవచ్చు

భారత్‌పై ముడిచమురు ధరల భారం, ఆర్థిక ఒత్తిళ్లు తప్పకపోవచ్చు

 

వాషింగ్టన్, వెలుతురు, నవంబర్ 01 :  ముడిచమురు ధరల పెరుగుదల, భారత్ మీద ప్రభావానికి సంబంధించి అంతర్జాతీయ సంస్థ కీలక నివేదికను వెల్లడించింది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ముగిసినప్పటికీ, భారత్‌పై అంతర్జాతీయంగా ముడిచమురు ధరల భారం, ఆర్థిక ఒత్తిళ్లు తప్పకపోవచ్చని ‘ఎమ్‌కే గ్లోబల్’ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ గెలిచినా కూడా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే విదేశాంగ నిర్ణయాలను వారు పెద్దగా అడ్డుకోలేరని పేర్కొంది. అలాగే ఇరాన్‌తో అమెరికా సంఘర్షణ మరింత తీవ్రతరం కావొచ్చని అంచనా వేసింది.

 

ఇరాన్ మీద దాడులు చేస్తే పెరుగుతాయా?

 

 

యూఎస్ మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమైతే చమురు ధరలు మరింత పెరిగి, అది భారతదేశ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (బీఓపి), విదేశీ మారక ద్రవ్య మార్కెట్, ఈక్విటీలపై ఒత్తిడిని పెంచుతుందని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన నివేదికలో వెల్లడించింది. “మధ్యంతర ఎన్నికల తర్వాత చమురు ధరలు తగ్గే అవకాశం లేదని మేము భావిస్తున్నాం. ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు చేస్తే ముడి చమురు ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. యూఎస్ ఎన్నికల ప్రభావం భారత ఆర్థిక మార్కెట్లపై ప్రత్యక్షంగా కాకుండా, ప్రధానంగా భౌగోళిక రాజకీయాల పరంగా ఉంటుంది” ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.