దుకాణాలు మూసేసింది బీజేపీ.. వ్యాపారులకు నష్టం చేసింది బీజేపీ : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, వెలుతురు, నవంబర్ 01 : దిల్లీలో ఇండీ కూటమి మెగా ర్యాలీకి ముందు అధికార బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కనాట్ ప్లేస్‌లో దుకాణాలను బలవంతంగా మూసివేయించారని ఆరోపించారు. దీనివల్ల స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని మండిపడ్డారు. ర్యాలీకి వచ్చే ప్రజలు దిల్లీలోని స్థానిక మార్కెట్లలో వస్తువులు కొనుగోలు చేయాలని తాము ముందుగానే చెప్పామని తెలిపారు. అలా చేయడం ద్వారా చిన్న వ్యాపారులకు మద్దతు లభిస్తుందని భావించామని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే కనాట్ ప్లేస్‌కు చేరుకున్న తర్వాత అక్కడ దుకాణాలన్నీ మూసి ఉండటాన్ని తాము గమనించామని చెప్పారు. బీజేపీనే అన్ని షాపులను బలవంతంగా మూసివేయించిందని ఆరోపించారు. వ్యాపారులకు ఎవరు నష్టం కలిగిస్తున్నారో ప్రజలు గమనించాలని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
