సేవా హృదయానికి జన నీరాజనం
ఆనందోత్సాహాలతో డాక్టర్ మధు శేఖర్ జన్మదిన వేడుకలు
ఆర్మూర్, వెలుతురు, నవంబర్ 03 : ఆర్మూర్ పట్టణంలోని ఎం జె హాస్పిటల్ లో హాస్పిటల్ అధినేత,చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మధు శేఖర్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల వివిధ పార్టీల నాయకులు,అన్ని వర్గాల ఆత్మీయులు,డాక్టర్ల బృందం హాజరై శుభాకాంక్షలు తెలిపారు.జన్మదిన వేడుక సందర్భంగా శాలువాతో సత్కరించి,పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.
పెర్కిట్, భీంగల్ ప్రజలకు ఉచిత ఓపీ సేవలు
పుట్టిన ప్రాంతం భీంగల్ కావడంతో ఆయా ప్రాంత ప్రజలకు ఉచిత ఓపీ సేవలు అందిస్తామని మరోసారి డాక్టర్ మధు శేఖర్ జన్మదిన సందర్భంగా వెల్లడించారు. అదేవిధంగా 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న పెర్కిట్ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఓపి ఫీజు లేకుండా ఉచిత సేవలు అందిస్తామని ప్రకటించారు.ఏలాంటి ఆపరేషన్లు ఎంజె హాస్పిటల్లో జరిగిన ఆపరేషన్ లో రాయితీలు ఉంటాయని చెప్పారు.రానున్న రోజుల్లో ఎలినినో ప్రభావంతో రైతులకు ఇక్కట్లు ఏర్పడి కరువు పరిస్థితి ఏర్పడుతుందని నివేదికలు చెబుతున్నాయన్నారు.ఈ సందర్భంగా ఆర్మూర్ పరిసర ప్రాంత రైతు కుటుంబాలకు కరువు పరిస్థితి ముగిసే వరకు ఉచిత ఓపీ సేవలు,ఎలాంటి ఆపరేషన్ జరిగిన 50 శాతం రాయితీలు ఉంటాయన్నారు.కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు కేవలం వారి మందులు,మత్తు డాక్టర్ ఫీజు చెల్లిస్తే ఆపరేషన్ చార్జీలు లేకుండా బ్రతికున్నంత వరకు ఉచితంగా చేస్తానని ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు.
మూడు తరాల ప్రజల ప్రేమకు కృతజ్ఞుడిని..
వయసు పెరుగుతూనే నాలో బాధ్యతను సేవ చేయాలన్న తపనను గుర్తు చేస్తున్న ప్రజలకు,మూడు తరాలుగా ఆశీర్వదిస్తున్న ప్రజల ప్రేమకు కృతజ్ఞుడిని అని డాక్టర్ మధు శేఖర్ బాగోద్వేగం అయ్యారు.డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న,సామాజిక సేవలో నా వెంటే నడుస్తున్న కుటుంబ సభ్యులకు,నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు,ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.కుల మత రాజకీయాలకు అతీతంగా సోషల్ మీడియా వేదికగా,దూర ప్రాంతాల వారు వాట్సప్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
