చెరుకు ధరపై చర్చకు రైతుల అత్యవసర సమావేశం

చెరుకు ధరపై చర్చకు రైతుల అత్యవసర సమావేశం

జహీరాబాద్ వెలుతురు, నవంబర్ 06: చెరుకు రైతులు ఎదుర్కొంటున్న ధరల సమస్యపై చర్చించేందుకు ఈ నెల 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జహీరాబాద్ అల్గోల్ రోడ్డులోని పీవీఆర్ గార్డెన్‌లో రైతుల ముఖ్య సమావేశం నిర్వహించనున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో చెరుకు పంటకు టన్నుకు సుమారు రూ.500 తక్కువ ధర లభిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల వ్యత్యాసం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి చెందిన చెరుకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.