బండి… కరీంనగర్ మహా పాదయాత్రకు నేనే వస్తా : నితిన్ నబీ
న్యూఢిల్లీ, వెలుతురు, నవంబర్ 06 :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యాంగబద్ద సంస్థలపై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొడుతూ సర్ విషయంలో వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు కరీంనగర్ లో చేపడుతున్న ‘మహా పాదయాత్ర’కు తానే స్వయంగా వస్తానని ఈ సందర్భంగా బండి సంజయ్ కు నితిన్ నబీ చెప్పారు.
వాస్తవానికి ఈనెల 5న కరీంనగర్ రావాల్సి ఉన్నప్పటికీ, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున రాలేకపోయానన్నారు. ఈసారి ‘చట్ పూజ’ అనంతరం తప్పకుండా కరీంనగర్ వచ్చి మహా పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. కరీంనగర్ లో కాషాయ శ్రేణుల జోష్ ను చూస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా నితిన్ నబిన్ బండి సంజయ్ తో చర్చించారు.
