వరి నారుతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం

వరి నారుతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్  07 :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ మరోసారి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పొలంలో వరి నారుతో ఆయన చిత్రపటాన్ని రూపొందించి ప్రత్యేకంగా అభిమానం చాటుకున్నారు. వరి పొలంలోనే సీఎం చిత్రాన్ని ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

 

సుమారు 20 రోజుల పాటు శ్రమించి రైతులు ఈ చిత్రాన్ని రూపొందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు చేసిన రుణమాఫీ పట్ల ప్రత్యేక అభిమానంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. వరి నారుతో సీఎం రూపాన్ని తీర్చిదిద్ది, పొలంలోనే ఆ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా పుట్టినరోజు వేడుకల్లో కేక్ కటింగ్‌లు, పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపే సంప్రదాయానికి భిన్నంగా వ్యవసాయ క్షేత్రాన్ని వేదికగా చేసుకుని రైతుల భాగస్వామ్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషంగా నిలిచింది.

 

వరి నారుతో రూపొందించిన ఈ చిత్రపటం ద్వారా మెట్టు సాయికుమార్ సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.