గిగ్‌ వర్కర్లకు డేటాపై పూర్తి హక్కులు : రాహుల్ గాంధీ 

గిగ్‌ వర్కర్లకు డేటాపై పూర్తి హక్కులు : రాహుల్ గాంధీ

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 14 :  గిగ్‌ వర్కర్ల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. గతంలో తెలంగాణ గిగ్‌ వర్కర్లతో జరిగిన సమావేశంలో వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నానని పేర్కొన్నారు. 21వ శతాబ్దం డేటా యుగమని, గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఉబెర్‌ వంటి సంస్థలన్నీ డేటా ఆధారంగానే నడుస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు గిగ్‌ వర్కర్లకు తాము చేసిన డెలివరీలు, తీసుకున్న సమయం, సంపాదించిన ఆదాయానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉండేది కాదన్నారు. కష్టం, డేటా వర్కర్లదే అయినప్పుడు దానిపై హక్కు కూడా వారికే ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన చట్టం ద్వారా గిగ్‌ వర్కర్లకు తమ పని డేటాపై పూర్తి అధికారం లభిస్తుందని, ప్రతి రైడ్‌, డెలివరీ, ఆర్థిక లావాదేవీకి సంబంధించిన సమాచారం వారికి అందుబాటులో ఉంటుందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.