బైక్‌ స్కిడ్‌ కావడంతో వెనక్కి వెళ్లా.. ఫిట్‌గా ఉండటంతో పరుగెత్తా

బైక్‌ స్కిడ్‌ కావడంతో వెనక్కి వెళ్లా.. ఫిట్‌గా ఉండటంతో పరుగెత్తా

 

హైదరాబాద్‌, వెలుతురు, నవంబర్ 14 :  గిగ్‌ వర్కర్ల ర్యాలీలో రాహుల్‌ గాంధీ పక్కన టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పరుగెత్తుకుంటూ రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బైక్‌ స్కిడ్‌ కావడంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని, తాను ఫిట్‌గా ఉండటంతో పరుగెత్తుకుంటూ వచ్చానని తెలిపారు. తాను పక్కన లేకపోవడాన్ని గుర్తించిన రాహుల్‌ గాంధీ పిలిచారని, ఆయన పక్కన పరుగెత్తే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. చిట్‌చాట్‌లో భాగంగా రాహుల్‌తో తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఓబీసీల స్థితిగతులు, ఫోన్‌ ట్యాపింగ్‌, రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ పరిస్థితులపై చర్చించినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై రాహుల్‌ ప్రశంసలు కురిపించారని చెప్పారు. సోనియా గాంధీ జీవిత చరిత్ర పుస్తకాన్ని రాహుల్‌ అభినందించారని, మూడు నెలల్లో దాని తెలుగు వెర్షన్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. భారత్‌ సమ్మిట్‌కు వచ్చే విదేశీ, భారతీయ ప్రతినిధులతో పాటు అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు పుస్తకాలను అందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాహుల్‌ కుర్తా పైజామా ధరిస్తే బాగుంటుందని సూచించగా, ఆయన నవ్వుతూ చాక్లెట్‌ ఇచ్చారని తెలిపారు. సంపన్న కుటుంబంలో పుట్టినా రాహుల్‌ ఆలోచనలు సామాన్యుల సంక్షేమం కోసమేనని మహేశ్‌ గౌడ్‌ పేర్కొన్నారు.