ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జితో మంత్రి పొన్నం భేటీ

ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జితో మంత్రి పొన్నం భేటీ

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 24 : ప్రజా భవన్‌లోని రాష్ట్ర అతిథి గృహంలో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి బీఎం సందీప్ కుమార్‌ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత వ్యవహారాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.