మహాత్మా జ్యోతిరావు పూలేకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘన నివాళి
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 28 :
సంఘ సంస్కర్త, మహోన్నత సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు పలువురు కాంగ్రెస్ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,వి.హనుమంతు రావు, దానం నాగేందర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, విజయలక్ష్మి, ఇందిరా శోభన్, కేతూరి వెంకటేష్‌తో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
