- రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి గారి కట్టుబాటు చారిత్రాత్మకం – రైతుల తరఫున కృతజ్ఞతలు
- రైతు భరోసా నిధుల విడుదల రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా – డా. రేఖ బోయలపల్లి
హైదరాబాద్ వెలుతురు జూలై 01:
రైతులను ఆర్థికంగా బలోపేతం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి అన్నారు. తెలంగాణ రైతాంగం సంక్షేమాన్ని ప్రభుత్వ పాలనలో అత్యున్నత ప్రాధాన్యతగా నిలిపిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతుల తరఫున ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్ల రైతు భరోసా నిధులను నేరుగా జమ చేయడం రైతు సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే 41.37 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించడం, సకాలంలో నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ద్వారా రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి దేనని కొనియాడారు.
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తూ రైతు సంక్షేమాన్ని ప్రభుత్వ విధానంలో కేంద్రబిందువుగా మార్చిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని ఆమె అన్నారు. రైతు కష్టాన్ని అర్థం చేసుకుని, ప్రతి ఎకరాకు, ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలుస్తున్న ఈ ప్రభుత్వం నిజమైన రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా తీర్చిదిద్దేందుకు రైతు భరోసా, రుణమాఫీ, సాగునీటి సౌకర్యాల కల్పన, మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం వంటి అనేక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ తెలంగాణ రైతాంగానికి కొత్త ఆశలను నింపుతున్నారని ఆమె అభినందించారు.
రైతు చెమటకు విలువనిస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా తీసుకుంటున్న ప్రతి నిర్ణయం తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని డా. రేఖ బోయలపల్లి పేర్కొన్నారు. గత 30 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు నిర్ణయాలు తీసుకుందని.. తెలంగాణలో వ్యవసాయం దండగ కాదని, పండుగగా మారేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. తెలంగాణ రైతాంగం పట్ల అపారమైన ప్రేమ, అంకితభావంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసింది.
