రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్ర

హైదరాబాద్ వెలుతురు జూలై 09:

రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్రను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నియమించారు. వద్దిరాజు పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న సురేశ్ రెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో వద్దిరాజు నియమితులయ్యారు.

ఈ సందర్బంగా వద్దిరాజు రవిచంద్ర పార్టీ అధినేత కేసీఆర్‌ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి రాజ్యసభ బీఆర్‌ఎస్‌ ఫ్లోర్ లీడర్‌గా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించినందుకు పార్టీ అధినేతకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్రని కేసీఆర్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.