సర్‌ను లైట్ తీసుకుంటే ఓటు గల్లంతే

  • మీ ఓటును కాపాడుకోండి… మీ భవిష్యత్తును కాపాడుకోండి
  • సర్ అనేది రాజకీయ కార్యక్రమం కాదు… ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమం
  • ప్రజాస్వామ్యంలో ఓటే బలమైన ఆయుధం
  • ఓటే లేకపోతే… మీ ప్రశ్నకు ప్రజాస్వామ్య బలం ఎక్కడిది?
  • ఆ ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తే ఓటును కోల్పోతారు
  • యువకులారా…సర్ ప్రక్రియలో పాల్గొనండి
  • మీ కుటుంబ సభ్యుల ఓట్లు పోకుండా చూడండి
  • సర్ పేరుతో కొన్నిచోట్ల రాష్ట్రంలో హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది
  • హిందువులంతా జాగృతమై సర్ ప్రక్రియలో పాల్గొనాలి
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు
  • కరీంనగర్ లో ఎన్యుమరేషన్ దరఖాస్తును నింపిన బండి సంజయ్
  • బీఎల్ఓ వద్దకు వెళ్లి ఫారమ్ ను అందజేసిన కేంద్ర మంత్రి
  • సర్ ప్రకియ పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్

కరీంనగర్ వెలుతురు జూలై 15:

రాష్ట్ర ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. ‘‘సర్ ను లైట్ తీసుకుంటే… మీ ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉంది’’అని హెచ్చరించారు. సర్ ప్రక్రియను ఎవరూ లైట్ తీసుకోవద్దని కోరారు. ‘మీ ఓటును కాపాడుకోండి… మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి’’ అని పిలుపునిచ్చారు. బుధవారం రోజున కరీంనగర్ కు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘‘సర్’’ ఫాంను నింపి చైతన్యపురిలోని సాధన స్కూల్ లో ఉన్న బీఎల్ వో అధికారుల వద్దకు వెళ్లి సమర్పించారు. అక్కడే ఆన్ లైన్లోనూ ఆ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ ఎలా కొనుసాగుతోంది? ఎన్యుమరేషన్ దరఖాస్తులను అందరికీ పంపిణీ చేశారా? ఎంత మంది ఎన్యుమరేషన్ దరఖాస్తులను నింపి అందజేశారు? ఈ విషయంలో ఓటర్లు పడుతున్న ఇబ్బందులేమిటి? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 24లోపు ఎన్యుమరేషన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం మంది ఓటర్లు మాత్రమే ఎన్యుమరేషన్ ఫాంలను అందజేశారని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్ర ప్రజలంతా సర్ ప్రక్రియలో పాల్గొనాలి. ఈనెల 24 వరకు సమయం ఉందని నిర్లక్ష్యం చేయకండి! చివరి రోజు కోసం ఎదురుచూడకండి. ఈ రోజే ఎన్యుమరేషన్ ఫారమ్ నింపండి… మీ ఓటును కాపాడుకోండి. అట్లాగాకుండా ‘నా దగ్గర ఓటర్ ఐడీ ఉంది… నాకు ఏమవుతుందిలే’’ అని ఇంట్లో కూర్చుంటే… రేపు ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌కు వెళ్లిన తర్వాత ‘‘లిస్టులో మీ పేరు గల్లంతవుతుంది. అందుకే చేతిలో ఓటర్ ఐడీ ఉంటే సరిపోదు… ఓటరు జాబితాలో పేరు ఉండాలి. అందులో భాగంగా బీఎల్ఓ మీ ఇంటికి వస్తే సహకరించండి. సర్ ఫారమ్ తీసుకోండి. వివరాలు సరిచూసుకోండి. ఫారమ్ నింపి గడువులోగా అందించండి.

ముఖ్యంగా తెలంగాణ యువతను కోరుతున్నా… మీ ఫోన్‌లో గంటల తరబడి సోషల్ మీడియా చూస్తారు. రాజకీయాలపై పోస్టులు పెడతారు. ప్రభుత్వాలను తిడతారు. నాయకులను ప్రశ్నిస్తారు. కానీ మీ ఓటు లిస్టులో ఉందో లేదో ఒక్కసారైనా చూసుకున్నారా? ఓటే లేకపోతే… మీ ప్రశ్నకు ప్రజాస్వామ్య బలం ఎక్కడిది? మీ ఇంట్లో అమ్మ ఓటు చూడండి. నాన్న ఓటు చూడండి. కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయో లేదో చూడండి.

ఎందుకంటే ఓటు అంటే కాగితం ముక్క కాదు. ఓటు అంటే ప్రజల చేతిలో ఉన్న అధికారం. ఓటు అంటే ప్రశ్నించే హక్కుకు బలం. ఐదేళ్లు నాయకులు ప్రజల దగ్గరకు రాకపోయినా, ఎన్నికల రోజు మాత్రం ప్రజల దగ్గరకు రావాల్సిందే. ఎందుకు? మీ చేతిలో ఓటు ఉంది కాబట్టి. అలాంటి ఓటును నిర్లక్ష్యంతో పోగొట్టుకుంటారా? ఆలోచించాలని కోరుతున్నా. ఎవరో చూస్తారులే… BLO చూసుకుంటారులే… పార్టీ వాళ్లు చూసుకుంటారులే… అని వదిలేయొద్దు! మీ ఓటు బాధ్యత మీదే! ముఖ్యంగా ప్రతి యువకుడు ‘‘నా కుటుంబంలో ఒక్క ఓటు కూడా పోనివ్వను’’ అని సంకల్పంతో చేయాలి!

సర్ అనేది రాజకీయ కార్యక్రమం కాదు… ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమం. ఈ రోజు సర్ ఫారమ్‌ను నిర్లక్ష్యం చేస్తే రేపు పోలింగ్ బూత్ దగ్గర పశ్చాత్తాపపడే పరిస్థితి రావచ్చు! మీ ఓటును కాపాడుకోండి…ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి. ముఖ్యంగా కొన్ని చోట్ల సర్ పేరుతో హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది. మజ్లిస్ తో కుమ్కక్కై కాంగ్రెస్ పార్టీ హిందువుల ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తోంది. ఇదే జరిగితే తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదముంది. తెలంగాణలోని హిందువులంతా జాగ్రుతం కావాలని, లేనిపక్షంలో తెలంగాణలో హిందువులంతా మైనారిటీలయ్యే ప్రమాదం ఉంది.

ఈ రోజు ఎన్యుమరేషన్ ఫారమ్ నింపడానికి పది నిమిషాలు కేటాయించకపోతే… రేపు ఎన్నికల రోజు ‘‘నా ఓటు ఎక్కడ?’’ అని బాధపడాల్సి వస్తుంది. అప్పుడు అధికారులను నిందించినా, వ్యవస్థను ప్రశ్నించినా కాలం వెనక్కి రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఓటు పోతే… మీ గొంతు బలహీనపడుతుంది. మీ ఓటు ఉంటే… మీ ప్రశ్నకు బలం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నాయకుడి కంటే గొప్పవాడు ఓటర్. ప్రభుత్వాల భవిష్యత్తును నిర్ణయించేది ఓటర్. రాష్ట్ర, దేశ భవిష్యత్తును నిర్మించేది ఓటర్. అలాంటి అమూల్యమైన ఓటు హక్కును నిర్లక్ష్యంతో కోల్పోవద్దు.

Leave A Reply

Your email address will not be published.