బీసీ ఉద్యోగులపై వేధింపులను ఆపాలి

  • బిసి ఉద్యోగులపై వ్యక్తిత్వ హననం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
  • బీసీ ఉద్యోగులపై అక్రమ కేసులను తొలగించి, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
  • బీసీ ఉద్యోగులను మానసికంగా వేధిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి
  • మలక్‌పేట్ ఇన్‌స్పెక్టర్ నరసింహ గౌడ్‌పై విధించిన సస్పెన్షన్​ను వెంటనే ఎత్తివేయాలి

హైదరాబాద్, వెలుతురు జూలై 30:

బీసీ ఉద్యోగులపై రోజురోజుకు వేధింపులకు గురిచేస్తూ, ఉద్యోగులను మానసికంగా వేధిస్తూ అక్రమ కేసులను బనయిస్తున్నారని బీసీ సంఘాల నేతలు అన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌ క్లబ్‌లో చేసిన మీడియా సమావేశంలో బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ చిన్న ఉద్యోగం దగ్గర నుంచి మొదలుకొని ఉన్నత ఉద్యోగం చేస్తున్న బీసీ ఉద్యోగస్తులపై అగ్రకుల ఆధిపత్య పోరు కొనసాగుతుందని, నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటూ చట్టానికి లోబడి ఉద్యోగం చేస్తుంటే, చట్టాన్ని చుట్టంగా మలుచుకొని తమ వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని కొంత మంది రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు చూస్తున్నారని, ఇకపై వారిని సహించేది లేదన్నారు. బీసీ ఓట్లతో గెలిచి బీసీ ఉద్యోగస్తులను బెదిరిస్తే ఊరుకునేదే లేదని, రాబోయే రోజుల్లో బీసీ ప్రజానీకంతోని దెబ్బ కొడతామని హెచ్చరించారు.

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బిసి జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు ఇవ్వకుండా, పోస్టింగులలో ప్రాధాన్యత ఇవ్వకుండా, మానసికంగా వేధిస్తూ తోటి ఉద్యోగులతో కించపరిచే విధంగా చేస్తున్నటువంటి అధికారులపై చర్య తీసుకోవాలని, బలహీన వర్గాల సంబంధించినటువంటి ఉద్యోగులను మానసికంగా వేధిస్తూ అక్రమ కేసులను పెట్టి సస్పెన్షన్ చేసి ఏ కారణం లేకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇటీవల మలక్‌పేట్ ఇన్‌స్పెక్టర్ నరసింహ గౌడ్‌పై తప్పుడు ఆరోపణలుతో సస్పెండ్ చేయడం దారుణమని, ఒక మహిళా న్యాయవాది అతనిపై కంప్లీట్ చేసి కావాలనే రద్దంతం చేస్తూ వారి సస్పెండ్ కు కారణమైందని, హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి, ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు.

ఫిర్యాదు చేసినటువంటి న్యాయవాది వివిధ శాఖలలో ఇప్పటివరకు 50 మందిపైన కేసులు వేసి అధికారులను మానసికంగా హింసిస్తూ బెదిరింపులు చేస్తున్న ఆమెపై చర్యలు చేపట్టాల్సిన అధికారులు, నిజాయితీగా పనిచేస్తున్న అధికారులను సస్పెండ్ చేయడం బాధాకరమని, అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూన న్యాయవాదిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

బీసీ ఉద్యోగులను మానసికంగా హింసిస్తూ, వారిపై దౌర్జన్యాలు చేస్తున్న వారిపై బీసీ సంక్షేమ సంఘం పోరాటం చేస్తుందని, వారి తరఫున ప్రత్యక్షంగా పాల్గొని బీసీ ఉద్యోగులను కాపాడుకుంటామని, బీసీలపై దాడులు, అక్రమ కేసులు ఆపకపోతే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఇంద్రం రజక, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు తొడుపునూరి సత్యం గౌడ్, గుంటి మహేష్ మేరు, బండిగారి రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.