“లయన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025–26”తో లయన్ కె. యాదయ్య గౌడ్‌కు ఘన సత్కారం

హైదరాబాద్, వెలుతురు ఆగస్టు 08: లయన్స్ డిస్ట్రిక్ట్ 320ఏ లో గ్లోబల్ ఎక్స్‌టెన్షన్ టీమ్ (GET) కోఆర్డినేటర్‌గా విశిష్ట సేవలందిస్తూ, లయనిజం అభివృద్ధి, విస్తరణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లయన్ కె. యాదయ్య గౌడ్‌కు ప్రతిష్ఠాత్మకమైన “లయన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025–26” లభించింది.

లయన్స్ డిస్ట్రిక్ట్ 320ఏ లో కొత్త లయన్స్ క్లబ్‌ల ఏర్పాటు, సభ్యత్వ విస్తరణ, నాయకత్వ అభివృద్ధి, కొత్త సభ్యులను లయనిజం వైపు ఆకర్షించడం వంటి కార్యక్రమాల్లో ఆయన చూపిన అసాధారణమైన చొరవ, అంకితభావం, నాయకత్వ ప్రతిభ, నిరంతర కృషికి గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డా. గడ్డం మహేంద్ర కుమార్ రెడ్డి  అందజేశారు.

గ్లోబల్ ఎక్స్‌టెన్షన్ టీమ్ (GET) కోఆర్డినేటర్‌గా లయన్ కె. యాదయ్య గౌడ్ కొత్త క్లబ్‌ల ఏర్పాటును ఒక బాధ్యతగా మాత్రమే కాకుండా, “లయనిజాన్ని మరింత విస్తరించి, ఎక్కువ మంది చేత సేవ చేయించాలి” అనే మహోన్నత లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లారు. కొత్త క్లబ్‌ల ఏర్పాటుకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తూ, సభ్యులను ప్రోత్సహిస్తూ, క్లబ్ నాయకులను సమన్వయం చేస్తూ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

తన సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినందుకు డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డికు యాదయ్య గౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.