ప్రజాసేవలో సీఎం రేవంత్ రెడ్డి మరింత ఉన్నత శిఖరాలకు చేరాలి : సురిగి నరసింహ గౌడ్
మునుగోడు,నవంబర్ 8 (వెలుతురు) : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సురిగి నరసింహ గౌడ్ ఆకాంక్షించారు. ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సురిగి నరసింహ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకున్నారు.ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అన్నం శ్రీశైలం,పాలుట్ల ప్రేమ్ కుమార్,సిద్ధగోని దశరథ,బత్తుల నాగరాజు గౌడ్,సురిగి శంకరయ్య గౌడ్, కిష్టయ్య గౌడ్, నందిపాటి జనార్ధన్, నందిపాటి యాదయ్య, బోయపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
