ఆపదలో ఉన్న కుటుంబానికి గోలి లింగస్వామి ఆర్థిక చేయూత

మునుగోడు,నవంబర్‌ 8 (వెలుతురు) : ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకోవడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం లింగయ్య శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న గోలి లింగస్వామి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం మృతుడి కుమారుడికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా లింగయ్య మృతి కుటుంబ సభ్యులతో పాటు గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. కష్టసమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన గోలి లింగస్వామి సేవాగుణాన్ని గ్రామస్థులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు,ప్రముఖులు పాల్గొని మృతుడికి నివాళులర్పించారు.