ఇందిరమ్మ ఇంటిలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంబరాలు

ఇందిరమ్మ ఇంటిలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంబరాలు

 

షాద్ నగర్, వెలుతురు, నవంబర్ 08 :  షాద్ నగర్ నియోజకవర్గంలోని పొత్తూరు తండాలో ఇందిరమ్మ ఇంటిలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య లు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వం, టీపీసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు కార్యక్రమాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తండాలోని ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే శంకరయ్య కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున సంబరాలు చేశారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇందిరమ్మ లబ్ధిదారులు మంగళ హారతులు ఇచ్చి శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. బాణసంచా కాల్చి ఉత్సాహంతో సంబరాలు చేశారు.