మునుగోడు,అక్టోబర్ 2 (వెలుతురు):మహాత్మా గాంధీజీ చూపిన సత్యం,అహింస,సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్, ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈరమళ్ల ప్రసాద్ తన తండ్రి ఈరమళ్ల స్వరాజ్యం జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి చెందిన 30 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు పల్లెర్ల శ్రీకాంత్,కార్యదర్శి పామనగండ్ల నవీన్‌కుమార్, కోశాధికారి నీల వెంకన్న,గౌరవ అధ్యక్షుడు ఎడవల్లి సురేష్‌కుమార్,క్లబ్ సభ్యులు,వార్డు సభ్యులు పాల్గొన్నారు.
