గాంధీ విగ్రహానికి జర్నలిస్టు వినతి

మునుగోడు,అక్టోబర్ 2 (వెలుతురు ): జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని వీడాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రతకు జాతీయ చట్టం తీసుకురావడంతోపాటు నూతన మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. రద్దు చేసిన వర్కింగ్‌ జర్నలిస్టు చట్టాల కింద గతంలో ఉన్న హక్కులను పునరుద్ధరించి,కొత్త వేతన మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలని, ఉద్యోగుల తరహాలో హెల్త్‌కార్డులు అందించి క్యాష్‌లెస్‌ వైద్యసేవలు కల్పించాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుంభం ఇంద్రసేనారెడ్డి, ముడుపు శ్యాం, జాజుల స్వామిగౌడ్, మార్నేని ప్రభాకర్, పెరుమాళ్ల ప్రమోద్‌కుమార్, రెడ్డిమల్ల వెంకట్, పాంపాటి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు


.

Leave A Reply

Your email address will not be published.