గాంధీజీ ఆశయాలను పాటించడమే నివాళి

మునుగోడు, అక్టోబర్‌ 2 (వెలుతురు ): సత్యం,అహింసా మార్గాలను ఆచరించడమే మహాత్మా గాంధీజీకి నిజమైన నివాళి అని సర్పంచ్‌ మాలుగు శ్రీను అన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం,అహింసా మార్గాలు నేటి సమాజానికి ఆదర్శమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను పాటిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బోయ సతీష్,పంచాయతీ కార్యదర్శి,సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.