- బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌కు మంచి స్పందన
- ఔత్సాహిక ఫిలిం మేకర్స్ విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 2 వరకు గడువు పొడిగింపు
- సమీక్షా సమావేశంలో నిర్ణయం
వెలుతురు, సెప్టెంబర్ 22:
బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక ఫిలిం మేకర్స్ విజ్ఞప్తి మేరకు పోటీలో పాల్గొనే గడువును అక్టోబర్ 2 వరకు పొడిగించారు. సోమవారం ఎఫ్‌డీసీ కార్యాలయంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. ముకుంద రెడ్డి, ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండా రాజు, జ్యూరీ కమిటీ చైర్మన్ హరీష్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
యువతలోని సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, ఔత్సాహిక ఫిలిం మేకర్స్‌కు తమ ప్రతిభను చాటుకునేందుకు మరింత అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గడువును పొడిగించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్, ఎఫ్‌డీసీ ఈడి. కిషోర్ బాబు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, విమలక్క, కాసర్ల శ్యామ్, పొన్నం రవిచంద్ర, అనిల్ జీలా తదితరులు పాల్గొన్నారు.
పోటీల థీమ్‌లు….
ఈ పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు క్రింది రెండు ప్రధాన థీమ్‌ల ఆధారంగా తమ షార్ట్ ఫిలింలు లేదా పాటలను రూపొందించాల్సి ఉంటుంది.
1. తెలంగాణ ప్రభుత్వ పాలన, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు( ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి), గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్)
2. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలు, బతుకమ్మ
ఈ పోటీలకు సంబంధించిన అర్హతలు :
1. ఈ పోటీలో పాల్గొనే వారందరూ 40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి.
2. వీడియో 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి.
3. షార్ట్ ఫిల్మ్స్/ వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలలో సూచించిన ‘థీమ్’ ల పైనే ఉండాలి.
4. మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు.
5. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రీకరించినవై ఉండాలి (బతుకమ్మ పాటలకు మినహాయింపు)
పోటీ కేటగిరీలు :
షార్ట్ ఫిలింమ్స్ : నిడివి గరిష్టంగా 3 నిమిషాలకు మించకూడదు.
పాటలు : నిడివి 4 నిమిషాలకు మించకుండా ఉండాలి.
ప్రభుత్వ స్కీమ్స్ : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై వ్యాసాలకు (రూ. 1 లక్ష బహుమతి).
బతుకమ్మ \ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాటలు
| బహుమతి | నగదు బహుమతి |
|---|---|
| ప్రథమ బహుమతి | ₹3,00,000 |
| ద్వితీయ బహుమతి | ₹2,00,000 |
| తృతీయ బహుమతి | ₹1,00,000 |
| కన్సొలేషన్ బహుమతులు (5 × ₹20,000) | ₹1,00,000 |
బతుకమ్మ \ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై లఘు చిత్రాలు
| బహుమతి | నగదు బహుమతి |
|---|---|
| ప్రథమ బహుమతి | ₹3,00,000 |
| ద్వితీయ బహుమతి | ₹2,00,000 |
| తృతీయ బహుమతి | ₹1,00,000 |
| కన్సొలేషన్ బహుమతులు (5 × ₹20,000) | ₹1,00,000 |
తెలంగాణ జానపద పాటలు
| బహుమతి | నగదు బహుమతి |
|---|---|
| ప్రథమ బహుమతి | ₹3,00,000 |
| ద్వితీయ బహుమతి | ₹2,00,000 |
| తృతీయ బహుమతి | ₹1,00,000 |
| కన్సొలేషన్ బహుమతులు (5 × ₹20,000) | ₹1,00,000 |
ప్రభుత్వ పథకాలపై ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీడియోలు
| బహుమతి | నగదు బహుమతి |
|---|---|
| ప్రథమ బహుమతి | ₹1,00,000 |
| ద్వితీయ బహుమతి | ₹50,000 |
| తృతీయ బహుమతి | ₹30,000 |
| కన్సొలేషన్ బహుమతులు (5 × ₹20,000) | ₹1,00,000 |
ఆర్టికల్స్ (3 పేజీలు లేదా 900 పదాలు మించకుండా)
| బహుమతి | నగదు బహుమతి |
|---|---|
| ప్రథమ బహుమతి | ₹1,00,000 |
| ద్వితీయ బహుమతి | ₹50,000 |
| తృతీయ బహుమతి | ₹30,000 |
ఎంట్రీలను Filmfreeway వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలి, ఏవైనా సందేహాల నివృత్తి కొరకు వాట్సాప్ నెంబర్ – 8125834009 ను సంప్రదించండి. ఎంట్రీలను పంపించేందుకు తుది గడువు అక్టోబర్ 2గా నిర్ణయించారు.
