హైదరాబాద్, వెలుతురు, సెప్టెంబర్ 28:
ప్రజా సాంస్కృతిక కళారంగంలో 50 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకున్న అరుణోదయ విమలక్కను సోమవారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన అభినందన కార్యక్రమంలో తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు మన్యబోయిన కృష్ణ యాదవ్, వెంకటరమణ, పేరయ్య యాదవ్, ప్రభాకర్ తదితరులు పాల్గొని అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా కళారంగంలో ఐదు దశాబ్దాలుగా విమలక్క అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలు, సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వివిధ ప్రజా పోరాటాల్లో ఆమె పోషించిన పాత్రను వారు ప్రశంసించారు. ప్రజా కళలను, సాంస్కృతిక ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడంలో విమలక్క చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని వారు అన్నారు.
