బెర్లిన్ : కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఆధ్వర్యంలో స్టడీ టూర్‌లో భాగంగా జర్మనీ రాజధాని బెర్లిన్ నగరానికి చేరుకున్న తెలంగాణ లెజిస్లేచర్ ప్రతినిధులకు బెర్లిన్ విమానాశ్రయంలో తెలంగాణ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కుమార్ గార్లకు తెలంగాణ విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఆధ్వర్యంలో తెలంగాణ లెజిస్లేచర్ తరఫున చేపట్టిన స్టడీ టూర్‌లో భాగంగా ప్రతినిధి బృందం నేడు బెర్లిన్ నగరానికి చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా పార్లమెంటరీ వ్యవస్థలు, శాసనసభల పనితీరు, ప్రజాస్వామ్య ప్రక్రియలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి వివిధ అంశాలపై అధ్యయనం చేయనున్నారు. అలాగే అక్కడి పార్లమెంటరీ వ్యవస్థలు, ప్రజాప్రతినిధుల విధులు, శాసన ప్రక్రియలకు సంబంధించిన అనేక అంశాలను పరిశీలించి, పరస్పర అనుభవాలను పంచుకోనున్నారు. అంతకుముందు.. బెర్లిన్ విమానాశ్రయంలో తెలంగాణకు చెందిన విద్యార్థులు, ప్రవాస తెలంగాణవాసులు ప్రతినిధి బృందానికి ఆత్మీయ స్వాగతం పలికారు.
బెర్లిన్‌లో తెలంగాణ లెజిస్లేచర్ ప్రతినిధులకు ఘన స్వాగతం
Prev Post
Next Post
