భారత్ సమ్మిట్‌లో ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం

భారత్ సమ్మిట్‌లో ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం

 

హైదరాబాద్‌, వెలుతురు, నవంబర్ 13 :

భారత్ సమ్మిట్‌–2026లో భాగంగా భారత్‌కు వివిధ దేశాలతో ఉన్న చారిత్రక సంబంధాలు, దౌత్యపరమైన అనుబంధాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో భారత ప్రధానులు వివిధ దేశాలతో నెలకొల్పిన స్నేహపూర్వక సంబంధాలు, అంతర్జాతీయ స్థాయిలో భారత్ సాధించిన దౌత్యపరమైన పురోగతిని తెలిపే ఫోటోలను వారు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎగ్జిబిషన్ ప్రాంగణంలోని పుస్తకాల స్టాల్‌ను సందర్శించి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలోంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని పరిశీలించారు.