నేడు గుజరాత్ కు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బృందం

హైదరాబాద్, వెలుతురు,  అక్టోబర్ 04

గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా జిల్లా, ఎక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద రెండు రోజుల పాటు సోమవారం,మంగళవారం(5,6 తేదీల్లో) కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన,కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరగనున్న రెండు రోజుల చింతన్ శివిర్ – 2026 వర్క్‌షాప్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు అధికారుల బృందం పాల్గొననుంది. మంత్రి వెంట వెళ్ళే అధికార బృందంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్,ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్లు బి.వి రావు, ధర్మారెడ్డి,వసంత్ నాయక్,పలువురు అధికారులు ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి వడోదరకు బయలుదేరి వెళ్ళి సాయంత్రం గుజరాత్ రాష్ట్ర ఎక్తానగర్,స్టాచ్యు ఆఫ్ యూనిటీ ప్రాంగణానికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బృందం చేరుకుంటుంది. సోమవారం ఉదయం 6:30 గంటల నుండి చింతన్ శివిర్ – 2026 కార్యక్రమాలు మొదలవుతాయి. రెండు రోజుల పాటు 5 సెషన్స్ గా చర్చలు జరుగుతాయి. PM గతి శక్తి – పలు ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై చింతన్ శివిర్ లో ప్రధానంగా చర్చిస్తారు. చింతన్ శివిర్ – 2026 లో దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్&బి శాఖ మంత్రులు పాల్గొననున్నారు.  ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చర్చిస్తారు. రీజనల్ రింగ్ రోడ్డు,NH-65విస్తరణ, ఎల్బీనగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్,భారత్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే,పలు NH ప్రాజెక్ట్స్ పై మంత్రి కోమటి రెడ్డి,కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా చర్చిస్తారు. రాష్ట్ర ప్రాజెక్టుల సాధనకు,కేంద్ర సహకారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి బృందానికి దిశా నిర్దేశం చేశారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో ముఖ్యమంత్రి పలు కీలక ప్రాజెక్టుల నిర్మాణ అంశాలపై చర్చించారు.

Leave A Reply

Your email address will not be published.