ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 21 : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. నవంబర్ 23న జరిగే సమావేశానికి హాజరుకావాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జి బీఎం సందీప్‌తో భేటీ కావాలని సూచించినట్లు సమాచారం. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డికి సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ భేటీ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకోనున్న పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
