కూష్మాండ అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారి దర్శనం

కూష్మాండ అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారి దర్శనం

కరీంనగర్, వెలుతురు : శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాశక్తి దేవాలయంలో నాల్గవ రోజు బుధవారం అమ్మవారు భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ మహాదుర్గ అమ్మవారు శ్రీ మహాచండి దేవి (కూష్మాండ) అవతారంలో పసుపు కొమ్ములతో సుందరంగా అలంకరించబడి భక్తులను అనుగ్రహించారు. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవార్ల అనుగ్రహం తమపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.

Leave A Reply

Your email address will not be published.