అచ్చంపేట చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
అచ్చంపేట, వెలుతురు : అచ్చంపేట మండలం హాజీపూర్ వద్ద స్థానిక శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికాయి. మన్ననూర్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద ఆయనకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్, చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ రేవంత్, అడిషనల్ కలెక్టర్ చెన్నయ్య, సబ్ కలెక్టర్ సలోని చాద్రా తదితరులు స్వాగతం పలికారు. మన్ననూర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘనంగా నివాళులర్పించారు. మన్ననూర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న ప్రజాయుద్ధనౌక, అమరజీవి గద్దర్ విగ్రహానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన్ననూర్లో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు.
