సమాఖ్య బిజినెస్ సమ్మిట్‌–2026 ప్రారంభించిన సీఎం రేవంత్ 

 తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : సీఎం

హైదరాబాద్: 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. SAMAKHYA బిజినెస్ సమ్మిట్‌–2026 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌ లక్ష్యాల సాధనకు పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రాన్ని CURE, PURE, RARE అనే మూడు ప్రాంతాలుగా విభజించి, ఐటీ, తయారీ పరిశ్రమలు, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని, దానిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

స్థానిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టి ప్రపంచస్థాయిలో ఎదగాలని, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సూచించారు. మహిళలకు రూ.61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని తెలిపారు. యువత, మహిళల అభివృద్ధికి సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ కృషి చేయాలని, పెట్టుబడులకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.