రైల్వే జీఎం కార్యాలయం ఎదుట కాంగ్రెస్ మెరుపు ధర్నా

రైల్వే జీఎం కార్యాలయం ఎదుట కాంగ్రెస్ మెరుపు ధర్నా

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 28 : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నా చేపట్టింది. నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అయితే, ప్రత్యేక రైళ్ల కేటాయింపునకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నిరాకరించడంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.

 

ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే, రైల్వే శాఖ నుంచి అనుకూల స్పందన రాకపోవడంతో జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.