గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి పనులను పరిశీలించిన మంత్రి పొన్నం 

గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి పనులను పరిశీలించిన మంత్రి పొన్నం

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 28 :   గోషామహల్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణ పనులను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఆస్పత్రి మోడల్ డిజైన్లు, వివిధ బ్లాకుల నిర్మాణ పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం పనులు పూర్తి చేయాలని, నిర్మాణంలో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని ఆదేశించారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు సుమారు రూ.2,700 కోట్ల వ్యయంతో, 2,000 పడకల సామర్థ్యంతో, 31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సదుపాయాలతో ఆస్పత్రిని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనులను ప్రతినెలా పర్యవేక్షిస్తామని, చిన్నపాటి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించారు.

 

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హుసేన్, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, మెట్టు సాయి కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.