ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 31 : భారతరత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్లో ఆమె చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ మధు యాష్కీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యురాలు భవాని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను వారు స్మరించుకున్నారు. దేశ సమగ్రత, అభివృద్ధి కోసం ఆమె చేసిన కృషిని కొనియాడుతూ ఆమెకు ఘన నివాళులు అర్పించారు.
