రోడ్డు అలైన్‌మెంట్ మార్పుపై హరీశ్‌రావు పరిశీలన
నార్సింగి, వెలుతురు, అక్టోబర్ 31 : 100 అడుగుల రోడ్డు అలైన్‌మెంట్ మార్పుతో నష్టపోతున్న కాలనీల్లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కాలినడకన పర్యటించారు. కొత్త అలైన్‌మెంట్ మార్కింగ్‌లతో ప్రభావితమవుతున్న కుటుంబాలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమ భవనాలను కూల్చేందుకు రెడ్ మార్కులు వేశారని కాలనీ వాసులు హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ కార్తీక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
