ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 31 : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు వద్ద ఉన్న ఆమె విగ్రహానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలను, దేశ సమగ్రత, సమైక్యత పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషిని వారు స్మరించుకున్నారు. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
దేశ ఐక్యతను కాపాడటంతో పాటు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఇందిరా గాంధీ ప్రదర్శించిన నాయకత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
