బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 31 : బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు చంద్రాయన్‌గుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ ముదిరాజ్, ప్రమోద్‌రెడ్డి, అనిల్, షకీల్ దయాని, ఆమీర్ బిందుయాజ్, సుల్తాన్, మోహన్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
