ఇందిరా గాంధీకి నివాళులు అర్పించిన మంత్రి తుమ్మల

ఇందిరా గాంధీకి నివాళులు అర్పించిన మంత్రి తుమ్మల

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 31 :  స్వర్గీయ ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు వద్ద ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలను, దేశ సమగ్రత, సమైక్యత కోసం ఆమె చేసిన కృషిని వారు స్మరించుకున్నారు. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

దేశ ఐక్యత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఇందిరా గాంధీ చూపిన నాయకత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.