మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్

మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 02 : నూతనంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్‌గా నియమితులైన నవీన్ మిట్టల్ సోమవారం సచివాలయంలో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి తన నియామకంపై కృతజ్ఞతలు తెలిపారు. నవీన్ మిట్టల్‌కు మంత్రి సీతక్క అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యకరమైన గ్రామాల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.