సీఈఓ తెలంగాణ ఆన్లైన్ వెబ్సైట్ లో నెలకొన్న సాంకేతిక సమస్యని వెంటనే పరిష్కరించాలి

సీఈఓ తెలంగాణ ఆన్లైన్ వెబ్సైట్ లో నెలకొన్న సాంకేతిక సమస్యని వెంటనే పరిష్కరించాలి

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 02 :  తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వెబ్‌సైట్ నిన్నటి నుండి పనిచేయడం లేదని, సాంకేతిక సమస్యల కారణంగా అందుబాటులో లేకపోవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు నమోదు ప్రక్రియ తీవ్రంగా ప్రభావితమవుతోందని తెలిపిన సామ. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు చివరి తేదీ 6 నవంబర్ 2026గా నిర్ణయించబడిన నేపథ్యంలో, ఈ కీలక సమయంలో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడం వల్ల ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వేలాది మంది అర్హులైన గ్రాడ్యుయేట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో, మీ కార్యాలయం వెబ్‌సైట్‌ను తక్షణమే పునరుద్ధరించి, ఎటువంటి ఆలస్యం లేకుండా ఓటరు నమోదు సేవలను తిరిగి ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.

వెబ్‌సైట్ పనిచేయని రోజుల సంఖ్యకు సమానంగా ఓటరు నమోదు గడువును పొడిగించాలి. తద్వారా సాంకేతిక సమస్యల కారణంగా అర్హులైన ఏ గ్రాడ్యుయేట్ కూడా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని కోల్పోకుండా చూడాలని వినతి పత్రం అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.