2 జిల్లాలకు రెడ్ అలర్ట్
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 03 : మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీని వణికిస్తున్న మురసు తుపాను ఇప్పుడు తెలంగాణపై ప్రభావం చూపించబోతుంది. తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కాగా.. సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈ 3 జిల్లాలకు ఆరంజ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
