తెలంగాణలోని ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా 

తెలంగాణలోని ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 5 : రాష్ట్రంలో చేపట్టబోయే పలు కీలక ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రూ.3,892 కోట్ల విలువైన ప్రాజెక్టులను కేంద్ర పట్టణాభిృవద్ధి శాఖ మంజూరు చేసింది. హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, అలంపూర్‌లో చేపట్టే 5 ప్రాజెక్టులకు అపెక్స్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. వాటికి కేంద్రం రూ.873 కోట్లు ఇవ్వనుంది. భాగ్యనగరానికి గోదావరి జలాల తరలింపు, వరంగల్ వరదనీటి కాల్వలు, వరంగల్ కోట, హనుమకొండ కోర్ ఏరియా అభివృద్ధి, అలంపూర్‌ వారసత్వ పర్యాటక పునరుజ్జీవ ప్రాజెక్టులకు కేంద్రం అర్బన్ చాలెంజ్ ఫండ్ మంజూరు చేసింది. ఆ ప్రాజెక్టులు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ మార్కెట్ లింక్డ్ ఫైనాన్సింగ్ విధానంలో అమలుకానున్నాయి. కేంద్ర ప్రభుత్వ వాటా 20 నుంచి 25 శాతం ఉంటుంది. సుమారు 50 శాతం రుణాలు, పీపీపీ, హ్యామ్ విధానంలో సేకరించనున్నారు. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు భరించనున్నాయి.