పోలీసులకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

పోలీసులకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

 

న్యూఢిల్లీ, వెలుతురు, నవంబర్ 5 : ఒక వ్యక్తిని పోలీసులు నిర్బంధించిన సమయం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అధికారికంగా అరెస్టు చేసిన సమయం నుంచి మాత్రమే ఈ గడువును లెక్కించాలన్న వాదన చెల్లదని తేల్చిచెప్పింది. నిర్బంధించిన తర్వాత విచారణ లేదా ఇతర ప్రక్రియల పేరుతో గడిపిన సమయాన్ని మినహాయించి, ఆలస్యంగా మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచడానికి పోలీసులకు అవకాశం లేదని స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం కల్పించిన రక్షణను అడ్డుకునేలా అరెస్టు, నిర్బంధం మధ్య వ్యత్యాసాన్ని ఉపయోగించరాదని కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌ చంద్రుర్కర్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈ తీర్పు ఇచ్చింది.