మధుయాష్కిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 05 : వరంగల్- ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఈ రోజు ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ని బంజారాహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్దిగా నియమితులైనందుకు సర్వోత్తమ్ రెడ్డికి మధుయాష్కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వివరించిన సర్వోత్తమ్ రెడ్డి గారు.. ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు సహకారం అందించాలని, ప్రచారానికి రావాలని మధుయాష్కిని ఆహ్వానించారు.
ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాకు చెందిన చాలామంది గ్రాడ్యుయేట్స్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న విషయంపై చర్చించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉంటున్న ఓటర్ల కు సంబంధించి తమ సహకారం పూర్తిగా ఉంటుందని.. వనస్థలిపురంలో ఉన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎన్నికల ప్రక్రియ కోసం వినియోగించుకోవచ్చని మధుయాష్కి సూచించారు.
