మహేష్ కుమార్ ను కలిసిన మున్నూరుకాపు సంఘం నేతలు

మహేష్ కుమార్ ను కలిసిన మున్నూరుకాపు సంఘం నేతలు

నార్సింగి, వెలుతురు, నవంబర్ 06: మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను పలువురు మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు, గాలి అనిల్ కుమార్, కొలగాని మహేష్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.