బీజేపీ పట్టణ కార్యవర్గంలో కొత్త నియామకాలు

బీజేపీ పట్టణ కార్యవర్గంలో కొత్త నియామకాలు

జహీరాబాద్ వెలుతురు, నవంబర్ 08: జహీరాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు పూల సంతోష్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పట్టణ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, పట్టణంలోని స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజా సమస్యలపై పోరాటం తదితర అంశాలపై చర్చించారు. ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి నౌబాత్ జగన్నాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు గొల్ల భాస్కర్, రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ గౌడ్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

అనంతరం పట్టణ నూతన పదాధికారులను నియమించారు. పట్టణ ప్రధాన కార్యదర్శులుగా అర్చన, శారద, సురేష్ పూరి, ఉపాధ్యక్షులుగా అఫ్సర్, దిల్దార్, కార్యదర్శిగా చెన్నూరి రాకేష్‌లను నియమించారు. వివిధ మోర్చాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను సైతం ఎంపిక చేశారు.

అలాగే బీజేపీ అగ్రనేత, భారతరత్న ఎల్.కే. అద్వానీ జన్మదిన వేడుకలను నిర్వహించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బొగ్గుల సంతోష్, అప్పం శ్రవణ్‌తో పాటు పలువురు జిల్లా, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

జహీరాబాద్, వెలుతురు, నవంబర్ 08 :  జహీరాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు పూల సంతోష్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పట్టణ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, పట్టణంలోని స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజా సమస్యలపై పోరాటం తదితర అంశాలపై చర్చించారు. ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి నౌబాత్ జగన్నాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు గొల్ల భాస్కర్, రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ గౌడ్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.