హైదరాబాద్‌లో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 14 :
లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు, ఎంపీ రాహుల్ గాంధీకి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీకి పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు.
