108, 102 అంబులెన్స్‌లలో ఉద్యోగ అవకాశాలు
🔹ఈ నెల 16, 17 తేదీల్లో సంగారెడ్డి కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు
జహీరాబాద్ వెలుతురు, నవంబర్ 15: జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 108 ఎమర్జెన్సీ, 102 అమ్మఒడి అంబులెన్స్‌లలో ఖాళీగా ఉన్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (EMTS), పైలెట్లు (డ్రైవర్లు) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. EMTS పోస్టులకు ANM, GNM, MLT, DMLT, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ డిగ్రీ అర్హత కలిగి, 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు 22 నుంచి 35 సంవత్సరాల వయస్సు, కనీసం 5.4 అడుగుల ఎత్తు, హెవీ లేదా LMV బ్యాడ్జ్ లైసెన్స్, లైసెన్స్ పొందిన తేదీ నుంచి కనీసం మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం తప్పనిసరి. సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్, మునిపల్లి, వట్పల్లి, గుమ్మడిదల, జహీరాబాద్, కోహీర్ మండలాల్లో ఖాళీలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు, ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో నవంబర్ 16, 17 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంగారెడ్డి కలెక్టరేట్లోని 108 కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ప్రోగ్రామ్ మేనేజర్ కిరణ్ (9110711270), జిల్లా మేనేజర్ ఎం. చంద్రకాంత్ (8498020412) నంబర్లను ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సంప్రదించాలని కోరారు.
