సర్ ను అడ్డుకునే వాళ్లంతా దేశ ద్రోహులే : బండి సంజయ్ 

సర్ ను అడ్డుకునే వాళ్లంతా దేశ ద్రోహులే : బండి సంజయ్ 

కరీంనగర్ వెలుతురు నవంబర్ 22: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ను అడ్డుకునే వాళ్లంతా దేశ ద్రోహులేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. విదేశీ అక్రమ చొరబాటుదారులకు ఓట్లు కావాలని కోరుకునే వాళ్లు సైతం నా ద్రుష్టిలో మూర్ఖులేనని మండిపడ్డారు. ఈ దేశ పౌరులకు మాత్రమే ఈ దేశ ప్రధాని, ముఖ్యమంత్రి మొదలు ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులుగా ఎవరు ఉండాలనేది నిర్ణయించే అధికారం ఉందన్నారు. 

కాంగ్రెస్ బీజేపీ పోటీయే కాదని, బీఆర్ఎస్ తోనే పోటీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు ‘‘బీజేపీ అంటే సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నడు. బీజేపీని తట్టుకునే దమ్ము కాంగ్రెస్ కు లేదు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలకు బీజేపీ అంటే భయం. బీజేపీని అడ్డుకోవాలని రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీని తట్టుకునే శక్తి కూడా లేదు’’అని అన్నారు. ఈరోజు కరీంనగర్ లోని గురుద్వార్ లో ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన 11 కేవీ సోలార్ ప్యానెల్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఏమన్నారంటే.. ఇప్పటి వరకు గురుద్వార్ కు ప్రతినెల రూ.25 వేల రూపాయల కరెంట్ బిల్ వచ్చేది. ఇంత అమౌంట్ చెల్లించడం ఇబ్బంది గా ఉందని గురుద్వార్ ప్రముఖులు చెప్పడంతో ఎంపీ లాడ్స్ నిధులతో సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేశాం. గతంలోనూ అనేక విధాలుగా సాయం చేశాను. గురుద్వార్ కు సాయం చేయడమంటే సేవ చేయడం. అది నా అద్రుష్టం. సిక్ కమ్యూనిటీ సోదరులు చాలా కష్టజీవులు. దైవ భక్తి ఎక్కువ. గురునానక్, గురుగోవింద్ సింగ్ సాహెబ్ బాటలో నడుస్తూ సమాజానికి తమ వంతు సాయం చేయాలనుకునే తత్వం కలిగిన వాళ్లు. అందుకే వాళ్లు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అటక్ నుండి కటక్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకే కాదు, ఆసియా నుండి ఆఫ్రికా ఖండం వరకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సిక్కులు కన్పిస్తారు. గురునానక్ ప్రపంచానికి అందించిన మూడు గొప్ప సూత్రాలను ఆచరిస్తున్న వ్యక్తులు సిక్కు మతస్తులు… అందులో భాగంగా 1.కీరత్ కరో – నిజాయితీగా కష్టపడి పనిచేయండి. 2.నామ్ జపో – భగవంతుడిని స్మరించండి. 3.వండ్ చకో – సంపాదించిన దానిని ఇతరులతో పంచుకోండి….. ఈ 3 సూత్రాలు ప్రతి మనిషి జీవితంలో ఆచరిస్తే సమాజంలో ఆకలి ఉండదు.. అసమానత ఉండదు.. విద్వేషాలకు చోటుండదు. అనే సూత్రాలను పాటిస్తున్నారు. వీరందరికీ ఎల్లుండి జరగబోయే గురునానక్ జయంతి శుభాకాంక్షలు. దేశం కోసం సిక్కుల త్యాగాలు అసమాన్యం. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోకూడదు. సిక్కుల చరిత్రను చదివితే ధైర్యం కనిపిస్తుంది.. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటే దేశభక్తి కనిపిస్తుంది.. వారి సేవలను చూస్తే మానవత్వం కనిపిస్తుంది. సిక్కు సమాజమంటే నాకు ప్రత్యేక అభిమానం. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో సిక్కుల పాత్ర చిరస్మరణీయం. అంతేకాదు దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సిక్కు సైనికుల సేవలు వెలకట్టలేనివి. పంజాబ్ లో మొన్నటి వరకు ప్రతి సిక్కు కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే, ఒకరిని దేశానికి, ఇంకొకరిని కుటుంబ బాధ్యతలు అప్పగించే వాళ్లు. అంటే ఇద్దరిలో ఒకరు కచ్చితంగా దేశ సైనికుడిగా సేవలందించేలా ట్రైన్ చేసే వాళ్లు. దీనినిబట్టే అర్ధం చేసుకోవాలి. దేశమంటే సిక్ కమ్యూనిటీకి ఎంతటి భక్తి, ప్రేమ ఉందో.. అంత గొప్ప సిక్కు సమాజాన్ని ఆదుకున్న పాలకులు ఇంతవరకు లేకపోవడం బాధాకరం. తెలంగాణ సిక్కు ప్రజలు కనీసం ఇల్లు లేక, ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ పిల్లలను కూడా చదివించుకోలేని దుస్థితిలో ఉన్నారు. వీళ్లను ఆదుకోవాల్సిన అవసరం పాలకులపై ఉంది.

 

దీంతోపాటు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ కరీంనగర్ వస్తున్నారు. సర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలపట్ల విబేధాలు స్రుష్టిస్తోంది. దీనిని తిప్పికొట్టేందుకు ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు బీజేపీ జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్ల మహా పాదయాత్ర పేరిట ర్యాలీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్ లో మహా పాదయాత్ర చేయాలని నిర్ణయింది. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన మహాపాదయాత్రకు అమిత్ షా హాజరయ్యారు. రేపు కరీంనగర్ లో జరగబోయే మహాపాదయాత్ర చరిత్ర స్రుష్టించబోతోంది. భారీ ఎత్తున కనీవినీ ఎరగని రీతిలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అన్ని సంఘాలు వచ్చి సర్ కు మద్దతుగా మహాపాదయాత్రకు హాజరై నితిన్ నబిన్ తో నడవాలని కోరుతున్నా.